SAKSHITHA NEWS

మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెం TKV రంగాచార్య – రంగనాయకమ్మ మెమోరియల్ లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR – మాధవి దంపతుల ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ పూర్తయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా కంటి చికిత్స అందిస్తూ వారికి చూపుని అందిస్తున్న లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.. ఇలాగే వారి సేవలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. గ్రామాలలో కూడా వారి సేవలను అందిస్తూ ఉండాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు..