జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

Congress Foundation Day Celebrations at the District Congress Office

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బుధవారం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు జెండాను ఆవిష్కరించి,కేక్ కట్ చేసి మిఠాయిలు పంచినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. డిసెంబర్ 28, 1885 న బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగిందని అన్నారు.ఈ దేశ స్వాతంత్రంతో పాటు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలిగించటానికి పోరాటం చేసి సాధించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.

ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యంగాన్ని రూపొందించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. భారతదేశంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, ప్లానింగ్ కమిషన్ తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని అన్నారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్య వివిధ భాగాలలో ఉంటూ భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కార్యకర్తల మధ్య స్నేహ సుహృద్భావాలను పెంపొందించడం , జాతి మత ప్రాంతపరమైన విభేదాలను తొలగించి జాతి ఐక్యత భావాలను పెంపొందించే లక్ష్యంగా 1885 డిసెంబర్ 28 న బొంబాయి లో కాంగ్రెస్ ఏర్పాటు జరిగిందని అన్నారు.

నాటి నుండి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ అవే లక్ష్యాలకు పరితపిస్తుందని అన్నారు. నేడు దేశంలో విబజించు పాలించు అనే రీతిలో బీజేపీ వ్యవహార శైలి ఉందని, నాటి బ్రిటిష్ పాలకులకు తీసుపోకుండ నేడు బీజేపీ దేశంలో మతాలు, ప్రాంతాల పేరుతో అల్లర్లకు ప్రేరేపిస్తుందని అన్నారు. జాతి ఐక్యత గా ఉండాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే కరోనా ఆంక్షల పేరుతో పాదయాత్ర ఆపేందుకు నాన ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.

గొప్ప గొప్ప సంస్కారణలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా యవజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్, వనం ప్రదీప్ చక్రవర్తి(బాబు), ఖమ్మం నగర కాంగ్రెస్ కార్పోరేటర్లు మిక్కిలినేని మంజులానరేందర్, మహ్మద్ రఫేదాభేగం, పల్లెబోయిన భారతిచంద్రం, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, నగర బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నగర మైనారిటి అద్యక్షులు అబ్బాస్,

యం పి టి సి నల్లమోతు లక్ష్మయ్య, కిలారి వెంకట రమణ,బి య చ్ రబ్బాని, కాళంగి కనకరాజు, అంబటి వెంకటేశ్వర్లు, భూక్యా బాలాజీ నాయక్, దాసరి పూర్ణ, రజి , యం డిగౌస్, ముజాయుద్దీన్, ఇబ్రహీం, కిలారి అనిల్, జహీర్, గడ్డం వెంకటయ్య, అబ్దుల్ ఆహాద్, రుక్ముద్దీన్, రియాజ్, అజమ్, భాస్కర్, కోట్యానాయక్, గాదర బాబు ,పేరం యశ్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page