The aim of the police is to provide protection and security to the people
ప్రజల రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యం
పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి
సాక్షిత :పెద్దపల్లి బ్యూరో:
రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతూర్తి గ్రామంలో పెద్దపల్లి డిసిపి రూపేష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ , ధర్మారం ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది మొత్తం 50 మందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు.
సరైన పత్రాలు లేనటువంటి 20 వాహనాలను సీజ్ చేసి చలాన్స్ వేయడం జరిగింది.కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా దొంగతుర్తి గ్రామం లో ఏసీపీ గ్రామస్థులతో, యువతి యువకులతో సమావేశమయ్యారు.ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు.గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ చేయడం,సేవించడం వంటివి చేయకూడదు అని గతంలో గంజాయి రవాణా,అమ్మిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడకూడదన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు.ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.
వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయం లో ఇన్సూరెన్స్ వర్తించదు మరియు ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.
వాహనాల నెంబర్ ప్లేట్లు కూడా నిబంధనల ప్రకారం ఉండాలని సూచించారు.దొంగతుర్తి గ్రామ ప్రజలు వారికి సంబంధించిన వాహనాల అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్స్ కలిగి ఉంటామని పోలీసు వారికి హామీ ఇవ్వడం జరిగింది
.ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ధర్మారం ఎస్సై శ్రీనివాస్, అశ్విని, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ, పెద్దపెల్లి ఎస్ఐ రాజేష్, బసంత్ నగర్ ఎస్సై శ్రీనివాస్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.