Electricity transformer should be installed in farmers’ crop fields
రైతుల పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని మల్ రెడ్డి గూడెం గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.
◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తరువాత మల్ రెడ్డి గూడెం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడి అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.
◆ గ్రామంలో అవసరమైన చోట విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు, పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట నూతనంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని మరియు రైతుల కోరిక మేరకు పంట పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ… సేవలందించాలన్నారు.
◆ గ్రామంలోని బావులపై పై కప్పులు ఏర్పాటు చేయాలన్నారు.
◆ గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు తొలగించి, మురుగు కాలువలను శుభ్రం చేస్తూ… పిచ్చి మొక్కలు, తొలగిస్తూ… శానిటేషన్ చేస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
◆ గ్రామంలో ప్రజల కోరిక మేరకు చేతి పంపు బాగుచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేసి, ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని పూర్తి స్థాయిలో అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
◆ మిషన్ భగీరథ మంచి నీటి ట్యాంకు ను ప్రతి నెల 1,11,21 తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
◆ గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
◆ గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.