Dharani system should be abolished in the state immediately
రాష్ట్రంలో వెంటనే ధరణి వ్యవస్థను రద్దు చేయాలి..
ప్రజా సమస్యలపై రఘునాథ పాలెం మండలం లో జరిగిన నిరసన కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
రాష్ట్రంలో వెంటనే ధరణీ వ్యవస్థను రద్దు చేసి, నిషేధిత జాబితాలో తప్పుగా నమోదైన భూముల సమస్యను పరిష్కరించాలని ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ అన్నారు. గురువారం నాడు రఘునాథ పాలెం మండలకేంద్రంలోని ఏం అర్ ఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.
అనంతరం మహ్మద్ జావిద్ మాట్లాడుతూ.. తెలంగాణలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడానికి తీసుకువచ్చిన ధరణీ పోర్టల్ లో లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వం భావిస్తున్నట్లు భూ సమస్యలకి పరిష్కారం దక్కకపోగా, కొత్త సమస్యలు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా, గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్య క్రమంలో రఘునాథ పాలెం మండల ముఖ్య నాయకులు భూక్యా బాలాజీ, కొంటే ముక్కుల నాగేశ్వర రావు ,ఎంపీటీసీ తేజవత్ వెంకన్న, కిలారు వెంకటరమణ, మామిడాల పుల్లయ్య, తావుర్య నాయక్, మాజీ సర్పంచ్ రెంటాల ప్రసాద్, బోయిన వెంకట నరసయ్య,
మందా బుచ్చిబాబు ,నునావత్ హరిసింగ్, రాయల మోహన్ రావు, అల్లు వెంకట రెడ్డి, ఎర్ర వెంకటరెడ్డి, తిరుమల భద్ర రెడ్డి, బోడపట్ల శ్రీను, తూము సత్యనారాయణ, షారూక్, ఆలస్యం సూరయ్య, దానయ్య, తది తరులు పాల్గొన్నారు