Construction work of new collectorate should be completed soon..Minister Puvvada
నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..మంత్రి పువ్వాడ.
పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ, హారితహరం ఓ ఏస్ డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ గౌతమ్..
[సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రజలను నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను దాదాపు గా పూర్తి కావచ్చయి.
ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరితహరం ఓ ఏస్ డీ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు.
కొనసాగుతున్న ఆయా పనులను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్లాన్ ను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రీనరిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి కేసీఅర్ చే లాంఛనంగా ప్రారభించుకునేందుకు సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణం, లోపల జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
భవనం మొత్తం తిరిగి విద్యుత్ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగంగా చేపట్టాలని ఆదేశించారు.