SAKSHITHA NEWS

40 people sanctioned under Kalyana Lakshmi/Shadimubarak scheme for many

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్,భారతి నగర్ నగర్ డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,04,640 /- నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి లబ్దిదారులకు చెక్కుల ను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.

పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్,విరేశం గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి,ప్రసాద్,కర్ణాకర్ గౌడ్, కాజా,సీతారాం తెరాస నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS