Corporator Narne Srinivasa Rao gave de-warming medicines to the students
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని టియెంఅర్ఎస్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ 1 క్యాంపస్ లో తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ వారు అందిస్తున్న డి వార్మింగ్ మందులను విద్యార్థులకు అందించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా అందిస్తున్న డి వార్మింగ్ మందులను అన్ని ప్రభుత్వ పాఠశాల లో ఉన్న విద్యార్థులకు ఆరోగ్య శాఖ వారి సిబ్బంది ఆధ్వర్యంలో మందులను అందజేస్తున్నారు అని, ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, విద్యార్థులు మరియు పాఠశాల వారు సద్వినియోగ పరుచుకోవాలి అని, అలానే ఆరోగ్య శాఖ సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జ్యోతి, సులక్షన, ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన, కళాశాల సిబ్బంది అనీల్ కుమార్, నిజాముద్దీన్, శైలజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.