SAKSHITHA NEWS

భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిం చనున్నారు.

ఈ పథకం కింద సొంత జాగా ఉన్నవారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం,ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వం అందించనుంది.ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హు లందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

WhatsApp Image 2024 03 11 at 10.23.42 AM

SAKSHITHA NEWS