SAKSHITHA NEWS

జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

తీర్దాల, స్నానాల లక్ష్మిపురం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయం, స్నానాల లక్ష్మిపురం జాతర ఏర్పాట్లపై దేవాదయా, రెవెన్యూ, విద్యుత్‌, ఇర్రిగేషన్‌, పంచాయితీ, ఆర్‌.టి.సి, మత్స్యశాఖ, ఫైర్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 8 నుండి జరిగే తీర్థాల, స్నానాల లక్ష్మిపురం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనం క్యూలైన్లు, లైటింగ్‌, పారిశుద్ధ్య పరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ శివారులో పార్కింగ్‌, మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఈ సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్‌, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్‌, ఎస్‌ఈ ట్రాన్స్‌కో సురేందర్‌, సీ.ఈ.ఓ జడ్పీ వినోద్‌, మిషన్‌ భగీరథ ఇఇలు పుష్పలత, వాణిశ్రీ, మత్స్య శాఖ ఏడి ఆంజనేయ స్వామి, దేవాదాయ అసిస్టెంట్‌ కమీషనర్‌ సులోచన, ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ రాంప్రసాద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 05 at 8.52.22 PM

SAKSHITHA NEWS