రాంనారాయణను పరామర్శించిన మంత్రి పొంగులేటి

Spread the love

టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణను రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి సాంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. మంగళవారం రాపర్తి నగర్లోని రాంనారాయణ ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాంనారాయణ ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం విధితమే. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పొంగులేటితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాంనారాయణ సమాచార శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి దృష్టికి తీసుకు వచ్చారు. హెల్త్ కార్టులు లేక క్యాన్లెస్ వైద్యం అందక జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటయ్యేవిధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు.

అలాగే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య ప్రధానమైందని ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపాలని కోరగా స్పందించిన మంత్రి పొంగులేటి హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పొంగులేటి వెంట కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంఎల్ఎసి బాలసాని లక్ష్మి నారాయణ, రాయల నాగేశ్వరావు, మువ్వా విజయబాబు, బొర్ర రాజశేఖర్ ,స్వర్ణకుమారి, టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, ఖదీర్, గోగి రెడ్డి శ్రీనివాస్,
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అవుల శ్రీనివాస్, కనకం సైదులు, టియుడబ్ల్యూజె (టిజెఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,ఐజెయి జిల్లా కోశాధికారి శివానంద, జిల్లా నాయకులు నలజాల వెంకట్రావు, మోహినుద్దీన్, ఎం. పాపారావు, శ్రీనివాస్, వై. మాధవరావు, రమేష్, భూపాల్, మహేందర్, కళ్యాణ్, జనార్ధనాచారి, సాగర్, సత్యనారాయణ, నామ పురుషోత్తం, మేడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నగర మేయర్ పరమార్శ

ఖమ్మం నగర మేయర్ పునుకోలు నీరజ రామబ్రహ్మం తో పాటు సిపిఎం జిల్లా ఇన్చార్జి కార్యదర్శి ఎర్ర శ్రీకాంత్, వై విక్రమ్, రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం ఆనంద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ పిల్లి రాజు తో పాటు కరీంనగర్ జిల్లా చెందిన ఐజేయు నాయకులు కూడా రాంనారాయణ ను పరామర్శించారు

Related Posts

You cannot copy content of this page