SAKSHITHA NEWS

గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు…

మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

పెదపాలెం హైస్కూల్ సమీపంలోని బీసీ కాలనీ వెళ్లే ప్రధాన రోడ్డు మట్టి రోడ్డు కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

సదరు సమస్యను గూర్చి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకువెళ్లారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే తన సొంత నగదు రూ. 1,50,000/- లను ఎంపీపీ దానబోయిన సంతోషరూపవాణి, జడ్పిటిసి సభ్యులు మేకతోటి అరుణ, గ్రామస్తులు చేతుల మీదుగా కాంట్రాక్టర్ కు అందజేసి టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు.

సమస్యను గంటల వ్యవధిలో పరిష్కరించి సిసి రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, చిలకా తిమోతి, యాల్లమ్మటి ప్రసాదు, బుల్లా శ్రీనివాసరావు, బుల్లా జకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 28 at 12.52.28 PM

SAKSHITHA NEWS