తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనలో మరో రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం

Spread the love

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి మరో రెండు హామీలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 500 రూ|| కే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది.

ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు గ్యారెంటీలను అమలు చేసిన సందర్భంగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ఈ రెండు గ్యారెంటీలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రెండు పతకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సహాయపడతాయి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు రవీందర్ గౌడ్ , జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ , ఎంపీటీసీ జనాబాయ్ , ఎంపీటీసీ లావణ్య నరేష్ , ఉపాధ్యక్షులు రాజు గౌడ్ , సీనియర్ నాయకులు జయ ప్రకాష్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎనగండ్ల నరేందర్ మరియు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Related Posts

You cannot copy content of this page