ఘనంగా 1st షాద్ నగర్ టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ బ్రౌచర్ విడుదల

Spread the love

1st Shad Nagar Town Level Chess Tournament Brochure released

ఘనంగా 1st షాద్ నగర్ టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ బ్రౌచర్ విడుదల

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి : షాద్ నగర్ చెస్ అకాడమీ కొచ్ నేషనల్ గోల్డ్ మేడలిస్ట్ వారణాసి జగన్ అధ్యర్యంలో మొట్ట మొదటి సారిగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్వహిస్తున్న టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ను స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

ఈ నేల (డిసెంబర్ ) 18 వ తేదిన మహబూబ్ నగర్ రోడ్డులో గల శాస్త్ర స్కూల్ లో నిర్వహిస్తున్న ఈ చెస్ టోర్నమెంట్ లో అండర్ 7 నుండి అండర్ 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు, పిల్లలు పాల్గొనవలసినదిగా కోచ్ వారణాసి జగన్ తెలిపారు.

అలాగే ఈ టోర్నమెంట్ బ్రోచర్ ను ఫరూక్ నగర్ జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కేశంపేట జడ్పీటీసీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఛైర్ పర్సన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, కౌన్సెలర్ ఈశ్వర్ రాజు, షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ (రాజు గౌడ్ )తదితరులు బ్రౌచర్ ను విడుదల చేశారు.

Related Posts

You cannot copy content of this page