ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108వ జయంతి

Spread the love

బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత,ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నిర్వహించిన జయంతి వేడుకలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగరావు , రవీందర్ ముదిరాజు తో కలిసి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని , ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.


సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేసారని తెలిపారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేసారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి వున్నదని ,కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, నరేష్, వినయ్ మరియు ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సిఎచ్.భిక్షపతి, కె.ప్రకాష్ , డి.అశోక్, పి.శివ శంకర్, వెంకట నరసింహారావు, శంకరయ్య, పి.ఎన్.రాములు, ఎం.రాములు, సిఎచ్.రాములు, మనయ్య, నవీన్, గణేష్, జనార్ధన్, అనంత రాములు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page