డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ

Spread the love

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల అక్రమ గంజాయిని దగ్దం చేసిన జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*
–గంజాయి అక్రమ రవాణ చేస్తే కఠిన చర్యలు.*

మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 26 కేసులలో 1379 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా యస్.పి, డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యస్.పి గారూ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 26 కేసులలో 1379 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగింది అని అన్నారు.యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని,జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,యస్.బి డి.యస్.పి రమేష్, నల్లగొండ డి.యస్.పి శివరాం రెడ్డి, , డి.సి.ఆర్.బి డి.యస్.పి సైదా, సీఐ రాఘవరావు, బీసన్న,సైదులు, నాగరాజు,ఆర్.ఐ లు సురాప్ప నాయుడు,సంతోష్,యస్.ఐ అంతి రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page