కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అస్లీ ఎవరు నకిలీ డాక్టర్లు

Spread the love

Who are the real and fake doctors in Kalvakurthi Private Hospital?

కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అస్లీ ఎవరు నకిలీ డాక్టర్లు

సాక్షిత ప్రతినిధి. : కల్వకుర్తిలో అందరూ దొంగలే, సరైన పత్రాలు లేకుండా చికిత్స చేస్తున్న ప్రవేటు హాస్పిటల్స్.

-కల్వకుర్తిలో వందల మంది మున్నాభాయ్ ఎంబిబిఎస్ లు.

-వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలకే ముప్పు చేస్తున్న వైనం.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అనుమతి పత్రాలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ ల్యాబ్ లు చూసి చూడనట్టు వివరిస్తున్న ఉన్నత అధికారులు. కల్వకుర్తి పట్టణంలో కొన్ని నెలల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్పిటల్ పై ,మరియు డయగ్రేషన్ ల్యాబ్లపై ,ఆర్ఎంపి హాస్పిటల్ పై, కల్వకుర్తి పట్టణంలో తనిఖీ చేసి సీజ్ చేసిన అధికారులు. సరైన పత్రాలు లేని వాటిని రెన్యువల్ చేసుకొని వాటిని ఏలాంటి పర్మిషన్ ,ఎన్ఓసి లేకుండా నడుపుతున్న పలు ప్రైవేటు హాస్పిటల్ పై వివరాలు అడిగి తెలుసుకుని వాటిని సీజ్ చేయడం జరిగింది.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ తనీకి నిర్వహించిన అధికారులు మళ్లీ కనిపించలేదు. పెద్దపెద్ద నాయకులు అధికారులపై ఒత్తిడి వల్ల మళ్లీ దాడులు చేయ లేదని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అధికారి దాడులు చేసి పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా రెన్యువల్ చేసుకోకుండా ప్రైవేటు హాస్పిటల్లోనూ నడిపిస్తున్న
వారిపై చర్యలు తీసుకున్నామని ,ఇంకా మునుముందు కూడా ప్రతి ఒక్క ప్రైవేటు క్లినిక్ ను చెక్ చేయడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలియజేసి వెళ్ళిపోయారు.

చాలాకాలం తర్వాత తనిఖీలు నిర్వహించే క్రమంలో ఈ విషయం తెలుసుకునీ ముందుగానే కొన్ని క్లినిక్లు ప్రవేట్ హాస్పిటల్లో బంద్ చేసుకొని వెళ్లారని ,వాటిని కూడా త్వరలోనే ఆకస్మికంగా తనిఖీ చేసి వారిపై కూడా తగ్గిన చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం కల్వకుర్తి పట్టణంలో చాలావరకు సీజ్ చేసి వెళ్లిపోయిన అధికారులు. ఏలాంటి పత్రాలు లేకుండా చికిత్స చేస్తున్న వారిపై ప్రైవేటు హాస్పిటల్ లో జరుగుతున్న మోసాలపై ఎలాంటి సమస్య వచ్చిన వారికి తెలిపిన వెంటనే చర్య తీసుకుంటామని ఆకస్మికంగా మరిన్ని హాస్పిటలను క్లినిక్లను తనిఖీ చేస్తామని,

తనిఖీల్లో భాగంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్లు షటర్లు క్లోజ్ చేసుకుని పక్కకు జారారు. దొంగతనంగా నడుపుతున్న క్లినిక్ లపై చర్య తీసుకుంటామని ఎలాంటి కోర్సు సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపై మెడికల్ షాపులో టాబ్లెట్స్ తదితర వంటివి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిఆటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేటు హాస్పిటలపై క్లినిక్ లపై కఠినమైన చర్యలు తీసుకొని లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.సంబంధిత డాక్టర్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది.

అదేవిధంగా అందులో పని చేసే ఉద్యోగుల సర్టిఫికెట్స్ కూడా. బెడ్స్ మరియు వారు తీసుకునే ఫీజు విషయంపై చేయవలసిన టెస్టుల సర్టిఫికెట్స్ మరియు వారి యొక్క అర్హత, సంబంధిత ల్యాబ్లను ఓపిని, స్కానింగ్ సెంటర్లను అందులో ఇచ్చే మెడిసిన్ కు సంబంధించి ప్రతి ఒకటి క్షుణ్ణంగా పరీక్షించి అవక తవకలు కనిపించిన వాటిపై సీజ్ చేయడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలియజేసి వెళ్లారు. ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్నడాక్టర్ కృష్ణమోహన్


ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక రాణి డిప్యూటీ డిఎంహెచ్ఓ, నరసింహ డి ఇ ఎం ఓ,వెంకట్ దాస్.డిప్యూటీడిఎంహెచ్వో,నటరాజ్ హెచ్ ఇ, డాక్య ఎంపీ హెచ్ ఈ ఓ, వినయ్ జూనియర్ అసిస్టెంట్, ఖాదర్ డిఎస్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు వచ్చి పోయిన తర్వాత యదావిధిగా ఆర్ఎంపీ డాక్టర్ల ఇష్టారాజ్యం తారస్థాయికి చేరుకుంది.

కొందరు ప్రైవేట్ డాక్టర్లు ఒక సర్టిఫికెట్ సంపాదించి మేము ఏదైనా చేయొచ్చు అని విధంగా అన్ని చేస్తున్నారు ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిన వాళ్ళు ఇచ్చే ముడుపులకు అసలు మళ్లీ కల్వకుర్తి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

ఇప్పటికైనా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇట్టి విషయంపై పట్టించుకోని కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో క్లినిక్లలో ఉన్న మున్నాబాయిలపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకొని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రాణాలు కాపాడాలని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page