తెలంగాణలో నేరుగా లబ్ధిదారులకె సంక్షేమ పథకాలు

Spread the love

Welfare schemes for direct beneficiaries in Telangana

తెలంగాణలో నేరుగా లబ్ధిదారులకె సంక్షేమ పథకాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో బంట్వారం మండలానికి చెందిన 553 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ స్మార్ట్ కార్డులు మరియు కల్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులు పంపిణి చేశారు.

▪️ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకె సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ అన్నారు.

▪️ తెలంగాణ రాష్టంలో మనిషి పుట్టుక నుండి మరణించిన తదనంతరం వరకు కూడా ప్రతి దశలో సంక్షేమం అందిస్తున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు

.

▪️పేద ప్రజలకు తోడుగా ఆసరాగా నిలుస్తూ… వృద్ధాప్య మరియు వితంతులకు 2016/-, వికలాంగులకు 3016/- రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.

అనంతరం లబ్ధిదారులకు వడ్డించి, వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page