పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాల సహకరిస్తాం

Spread the love

ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తాం
ఘనంగా టీ హబ్ లో ఆటా & CII బిజినెస్ సెమినార్*
హైదరాబాద్ యు.ఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్ తో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్నివిధాల సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ టీ హబ్ లో ఆటా వేడుకల్లో భాగంగా ఆటా మరియు CII ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంబసీ యు.ఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్ తో కలిసి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది అని అన్నారు. అలాగే వారికి ఏ సమస్యలున్నా తీర్చే బాధ్యత మాదేనని అన్నారు. ఆటతో తనకు మంచి అనుబంధం వుందని, మంచి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆటా, CII వాళ్ళను అభినందిస్తున్నాను అన్నారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన హైదరాబాద్ ఎంబసీ యు.ఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ…. అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా వున్నారని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటా కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే అమెరికా లో తెలుగు వారు చాలా ఉన్నతంగా ఎదిగారని అన్నారు. హైదరాబాద్, అమెరికా మధ్య సంధానకర్తగా ఆటా వ్యవహరించడం అభినందనీయం అన్నారు. హైదరాబాద్ కు అమెరికా నుండి పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తాం అన్నారు.

ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ….ఆటా వేడుకల్లో భాగంగా ఈ బిజినెస్ సెమినార్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సెమినార్ తెలంగాణ, అమెరికా మధ్య సంబంధాలు మరింత పెంపొందించడానికి ఉపయోగపడతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 జూన్ 7,8,9 లలో నిర్వహించే ఆటా మహాసభలకు అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని రమ్మని ఆహ్వానించారు.

CII అధ్యక్షులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ….ఆటా వారితో ఈ సెమినార్ ని సంయుక్తంగా చేయడం తమకు ఆనందంగా వుందన్నారు. ఈ అనుబంధం మరింత పెంపోందాలని ఆకాంక్షించారు.

ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ….పెట్టుబడి పెట్టడానికి వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, ఆటా కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం,18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, బిజినెస్ కో చైర్ రామ్ మట్టపల్లి, లక్ష్ చేపురి,హరీశ్ బత్తిని, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page