Vinayakasagar works should be expedited – Commissioner Anupama Anjali
వినాయకసాగర్ పనులు వేగవంతం కావాలి – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత : తిరుపతి వినాయకసాగర్ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం వినాయక సాగర్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ తగు సూచనలు జారీ చేసారు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి.
తిరుపతి నగరానికే వన్నె తెచ్చేలా రూపుదిద్దుకుంట్టున్న వినాయక సాగర్ నగర ప్రజలకే కాకుండా యాత్రీకులకు కూడా ఆహ్లాదం పంచేలా రూపుదిద్దుకుంట్టున్న విషయాన్ని ప్రస్థావిస్తూ వినాయకసాగర్ మొత్తం చుట్టు పక్కల చూపరులను ఆకట్టుకునే విధంగా సుందరీకరంగా ఉండేలా చూడాలని, వినాయక సాగర్ పనులు త్వరగా పూర్తి చేయడం కోసం ఎక్కువ మంది మనుషులను పెట్టి పనులు తొందరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
సంక్రాంతిలోగా ఓక తుది రూపుకు రావాలనే విషయాన్ని గుర్తుంచుకొని పనులు సాగించాలన్నారు. వినాయకసాగర్ డివైడర్లలో అందమైన చెట్లు స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలన్నారు. అలాగే సాగర్ గట్టు చుట్టూ చదును చేసి ప్లాన్ ప్రకారం చెట్లు, పచ్చటి గడ్డితో లాన్ ఏర్పాటు చేయాలన్నారు.
చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వినాయకసాగర్ ముందర నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ అనుపమ అంజలి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మెహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.