ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ

Spread the love

Via Ellammabanda from Ushamullapudi Kaman to Gajularamaram

సాక్షిత ; ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ లో భాగంగా ఈ రోజు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ నార్నె శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామరం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినది అని ,దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో మరియు కార్పొరేటర్ల తో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

100 ఫీట్ రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని , యుద్ధప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విభాగిని పనులు నాణ్యత ప్రమాణాలు తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అధికారులను ప్రభుత్వ విప్ గాంధీ అదేశించడం జరిగినది.

రోడ్డు విస్తరణ పనులు పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, 100 ఫీట్ రోడ్డు రోడ్డు విస్తరణ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని,ఈ100 ఫీట్ రోడ్డు విస్తరణ వలన ప్రజలకు సమయం ,ఇంధనం ఆదా అవుతుంది అని,మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది.

,ట్రాఫిక్ సమస్య నివారణకై , నాణ్యమైన ,మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని , ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గాంధీ చెప్పడం జరిగినది .ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. 100 ఫీట్ రోడ్డు విస్తరణ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అని,ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.


అదేవిధంగా ఎల్లమ్మ చెరువు నుండి HMT శాతవాహన కు వెళ్లే రోడ్డు పై కోర్ట్ కు సరిపడా సమాచారం అందచేసి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు ను వెంటనే వేసేల చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేశారు, ఎల్లమ్మ చెరువు సుందరికరణలో భాగంగా మురుగు నీరు కలవకుండా డ్రైనేజి పైప్ లైన్ ఔట్ లెట్ సమస్య ను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేశారు.

అదేవిధంగా శేరిలింగంపల్లి
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ . పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో GHMC AE సుభాష్ , వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు ప్రసాద్, కాశినాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, రాములుగౌడ్, విష్ణు, దాతి రమేష్, నరసింహులు, సిద్దయ్య, మహేష్, ఇంతియాజ్, కూర్మయ్య, మీసాల జానయ్య, బాలరాజు, చాణిక్య, దనుంజయ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కృష్ణ కుమారి, అంజలి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page