సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెంకటేష్ గౌడ్

Spread the love




సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ఆదిత్య నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, కాలనీ వాసులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్, గణేష్, నభి, మోహన్ గుప్త, రాజశేఖర్, శ్రీనివాస్, శ్రీకాంత్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page