SAKSHITHA NEWS

Vaikuntha dama should be established

వైకుంఠ దామాన్ని ఏర్పాటు చేయాలి


డిఆర్ఓని కలిసిన మాల మహానాడు నాయకులు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ని కలిసిన 60 వ డివిజన్ మాల మహానాడు సంఘ సభ్యులు.. గత 100 సంవత్సరాల నుంచి 58వ సర్వే నెంబర్ లో మా తాత ముత్తాతలు దహన సంస్కరణలు జరుపుకునే వారమని, ఈ మధ్య కాలంలో ఇటకబట్టి వ్యాపారస్తులు కొందరు మమ్ములను మీరు మాల కులస్తులని మీకు ఇక్కడ ఏముందని ప్రభుత్వ భూమిలోకి మీరు రాకూడదని మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనితెలిపారు.

అయినా ఇప్పటివరకు మాలో ఎవరు చనిపోయిన అక్కడే ఖననం చేస్తున్నాం.కానీ ఈ మధ్యకాలంలో పోక్లైన్ పెట్టి కొన్ని సమాధులను నేలమట్టం చేశారు. మేము ఆ విషయం తెలుసుకుని అడ్డగించగా కొన్ని సమాధులు అలా మిగిలి ఉన్నవి. ఈ విషయాన్ని గతంలో ఎమ్మార్వో కి తెలపడం జరిగింది.

కలెక్టర్ దృష్టిలో పెట్టామని అప్పటి ఎమ్మార్వో మమ్ములను పక్కదారి పట్టించారు. ఇప్పటివరకు మేము బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య దహన సంస్కరణలు చేసుకోవలసి వస్తుంది కాబట్టి మీరు మాపై దయవుంచి మాకు సర్వే నెంబర్58 లో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయించగలరని వినతి పత్రం అందజేయడం జరిగింది

.
ఈ కార్యక్రమంలో
పిల్లి సురేందర్, వెంకటేశ్వర్లు, నామ యేసురత్నం, జంగం కన్నయ్య, బాలశౌరి, పిల్లి వెంకటేశ్వర్లు, రత్నం తదితరులు మరియు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS