గ్రామీణ ఉపాధి హామీ చట్టాము అమలు

Spread the love


Implementation of Rural Employment Guarantee Act

గ్రామీణ ఉపాధి హామీ చట్టాము అమలు –సవాళ్లు అనే అంశం పైన నవంబర్ 15 న ఉదయం 11-30 గం!లకు హైదరాబాద్ రవీంద్ర భారతి లో సెమినార్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉంటుంది, జయప్రదం చేయండి.

సాక్షిత వికాకారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు,గ్రామీణ ఉపాధి హామీచట్టం అమలు –సవాళ్లు అనే అంశం పై,

సెమినార్ పోస్టరను స్థానిక

మున్సిపల్ పార్కులో విడుదల చేసినారు. ఈసందర్బoగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ,కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసిందని తెలిపారు,దానితో ఉపాధిని దెబ్బ తీసిందన్నారు, ఇందుకొరకు రాష్ట్రa సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నవంబర్ 15-11-2022 నాడు ఉదయం 11-00 గంటలకు సెమినార్ ఉంటుందన్నారు.

ఇట్టి సెమినార్ కు, కేరళ మంత్రి ఎంబి రాజేష్ గ్రామీణ అభివృద్ధి, లోకల్ బాడీస్ మరియు ప్రోహిబిషన్ అప్కారి శాఖ మాత్యులు, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు RWS మంత్రి, ఎర్ర బెల్లి దయాకర్ రావు , అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం బి. వెంకట్ . శ్రీ జి. నాగయ్య తెలంగాణ రాష్ట్రసంఘం అధ్యక్షులు. శ్రీ ఆర్. వెంకట్రాములు సంఘం రాష్ట్ర కార్యదర్శి. పాలొగొంటారు,

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు మరియు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, ఈ సెమినార్ ను నిర్వహిస్తున్న మన్నారు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3 వ మహాసభలు 2022 డిసెంబర్ 5-7 తేదీల్లో ఖమ్మం పట్టణము లో జరుగుతున్నాయి,

ఈ పూర్వ రంగంలో ఉపాధి హామీ, వేతన సమస్య, భూసమస్యలాంటి, సమస్యల పై సెమినార్లు జరుగుతున్నాయి, ఇందులో వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్ధిక వేత్తలు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటున్నారని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో K. శ్రీనివాస్ సిపిఎం జిల్లా కార్యదర్శి, ఉప్పలి భు గ్గప్ప,వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page