లంచాలతో అవినీతి మయంగా మారిన టౌన్ ప్లానింగ్

Spread the love

లంచాలతో అవినీతి మయంగా మారిన టౌన్ ప్లానింగ్
కుత్బుల్లాపూర్ : సూరారం :


సాక్షిత : సూరారం అవుట్ పోస్ట్ సమీపంలో మెయిన్ రోడ్ పైన అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వారికి అందాల్సిన ముడుపులు అందితే వారికి ఎన్ని కంప్లైంట్స్ వెళ్లన పట్టించుకోరు సమాధానం ఒక్కటే నోటీసు ఇచ్చాము అని చేతులు దులుపు కుంటారు, కొన్ని సందర్భాలలో నోటీసులు ఇవ్వకుండా ఇచ్చాము అని కూడా చెబుతారు, సూరారం జ్యోతి డైరీ మిల్క్ సమీపంలో మరియు సూరారం విలేజ్ లో నిర్మించిన భారీ అక్రమ షెడ్లు దానికి ఉదాహరణ వాటిని కూడా చూసి చూడనట్టు వ్యవహారించారు ఎందుకు అంటే వారికి అందాల్సిన వి అదే నండి ముడుపులు అందినయి అని అందుకే టౌన్ ప్లానింగ్ వాళ్ళు చర్యలు చేపట్టలేదు అని స్థానికులు అంటున్నారు, మరి ఇప్పుడు సూరారం అవుట్ పోస్ట్, మరియు సూరారం బస్సు స్టాప్ వద్ద ఉన్న అనుమతులు లేని బహుళ అంతస్థులు నిర్మాణం పైన కూడా వారికి ముడుపులు అందాయి అని వాటిపైన కూడా చర్యలు ఉండవు అంటున్నారు కొందరు, టౌన్ ప్లానింగ్ కుత్బుల్లాపూర్ నిఘా వ్యవస్థ కొరవడింది అని వారి పై ఏసీబీ(anti corruption bureau )నిఘా పెడితే అక్రమార్జన చేసే వారిని పట్టుకోవచ్చు అని కొందరు బహటంగానే చెబుతున్నారు,అనుమతులు లేని వాటి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి?????

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page