ఈసారి గెలిపించి చూడండి,గద్వాలను ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా౼డికె. అరుణమ్మ..
ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు..
గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో దరూరు మండలం ఖమ్మం పాడు గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన నాయకులు 100 మంది భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె . అరుణమ్మ ..
ఈ సందర్భంగా డికె. అరుణమ్మ మాట్లాడుతూ..
మాట ఇచ్చానంటే మాట తప్పనని అది గద్వాల ప్రజలందరికీ తెలుసని మీ సమస్యలు ఏమైనా ఉంటే వివరించాలని హామీ ఇచ్చిన తర్వాత అరుణమ్మ మాట తప్పదని అన్నారు..
డీకే అరుణమ్మ ఉన్నంతకాలం పేద ప్రజలకు న్యాయం చేస్తూ, గద్వాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు..
ప్రజల కష్టం తెలియని వాళ్ళు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తూన్నారని గెలిచిన తర్వాత శంషాబాద్ లో కూర్చొని గద్వాలను అభివృద్ధికి నోచుకోకుండా చేస్తారని అన్నారు..
పిల్లల భవిష్యత్తు జీవితాలు వృద్ధి లోకి రావాలంటే దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని అన్నారు..
బిఆర్ఎస్ ప్రభుత్వం 10ఏళ్ళు అయిన ఒక స్కూల్ గాని ,ఒక హాస్టల్ గాని,స్కూల్ కాంపౌండ్ వాల్ కట్టింది లేదు..
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బిజెపి పార్టీ తోనే సాధ్యమని రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు.
పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు..
పార్టీలో చేరిన వారు
మేకల గోవిందుబి. రమేష్, k. అశోక్, నాయిబాయి నరసింహులు, b.విరేశ్, నారాయణ ,గోవర్ధన్, వెంకటేష్, నాయిబాయి కృష్ణ ,గోవిందు, ఎద్దుల రాజు, తాయన్న ,ఎస్సీ సవరప్ప,తదితరులు ఉన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే,పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు ,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, ఖమ్మంపాడు సర్పంచ్ పార్వతమ్మ, ఉప సర్పంచ్ సురేష్,బిజెపి సీనియర్ నాయకురాలు సరలమ్మ, సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి,అశోక్, తిమ్మా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.