ఓటమిని నమ్ముకుని చంద్రబాబు వెళ్తున్న తొలి ఎన్నిక ఇది

Spread the love

This is the first election that Chandrababu is going for defeat

ఓటమిని నమ్ముకుని చంద్రబాబు వెళ్తున్న తొలి ఎన్నిక ఇది : శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *


సాక్షిత : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ తన స్థాయిని దిగజర్చుకొని వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు


“ఇదేం ఖర్మా” అంటూ తెలుగు దేశం అధినేత చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమంపై నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. కర్నూలు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతున్న మాటల పట్ల తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదే చివరి ఎన్నిక అని రోడ్డు మీదకి వచ్చి ఏడవటం హాస్యాస్పదం అన్నారు.

రోజుకో కొత్త డ్రామా ఎత్తుకొని… రక్తి కట్టించడానికి నానా పాట్లు పడుతున్నారు అని అన్నారు. బాబు పన్నిన సానుభూతి వ్యూహం పోయినట్లే కనిపిస్తోంది. నిన్న కర్నూలు పర్యటనలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయన్ను ప్రజలు ప్రశ్నించారన్నారు.

వాటిపై స్పందించడానికి బదులు ప్రజలపై, ముఖ్యమంత్రిపై మాటల దాడి చేయడం, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి “దద్దమ్మలు, పనికిమాలిన సన్నాసులు” అనడంతోపాటు తంతానని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి, జగనన్నకు లభిస్తున్న ఆదరణ చూసి భయపడిన బాబు నిరుత్సాహానికి గురవుతున్నట్లు కనిపిస్తోందన్నారు


మోడి పర్యటన తరవాత చంద్రబాబులో ఓటమి భయం బాగా పట్టుకుంది అన్నారు. జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని స్పష్టమైన సంకేతాలు రావడంతో బాబు వెన్నులో వణుకు పుడుతుంది అన్నారు

వైఎస్సార్ సీపీ,జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం, గౌరవం ఇస్తోందన్నారు. జగనన్నను, ఆయన పథకాలను పనికిరానివని, మూర్ఖమైనవని తిట్టి, శాపాలు పెడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అందరికీ సంక్షేమ పథకాలు అందేలా సీఎం ఇదంతా చేస్తున్నారు – అది తట్టుకోలేక ఇలా తిడతాడా? అని ప్రశ్నించారు

చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవలన్నారు.వెన్నుపోటు రాజకీయాలకు నిజమైన నాయకత్వం చంద్రబాబే అని అన్నారు. వయో భారం తో అసత్య అరోపణలు చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదని హితబోధ చేశారు. ప్రజల కోసం నిత్యం పాటు పడే మా ముఖ్యమంత్రి ప్రశ్నించే నైతిక హక్కు కూడా నికు ,నీ నాయకులకు అసలు లేదన్నారు.

ప్రజల మధ్య ఉన్నపడు వారిని రెచ్చ గొట్టే విధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మీ హాయం లో ఎలాంటి అభివృద్ధి లేదు.. ప్రస్తుతం ప్రజలు అందరూ అన్ని అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాల తో సుఖంగా ఉన్నారని స్పష్టం చేశారు. 80శాతం మంది ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా జగనన్న పని చేస్తున్నారన్నారు

గడప గడప కార్యక్రమం లో ప్రజల నుండి విశేషస్పందన వస్తుందిన్నారు. మరో 8 రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి 100 రోజులు అవ్తుంది అన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా వైఎస్సార్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు

Related Posts

You cannot copy content of this page