There should be a specific plan for crime control.
నేరాలు నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక వుండాలి.
అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శబరిష్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
నేరాలు నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక వుండాలని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శబరిష్ అన్నారు. నేరసమీక్ష సమావేశం గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సమావేశంలో
అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ విజబుల్ పోలీసింగ్ ద్వారా తనిఖీలు ముమ్మరం చేయడం తద్వారా భవిష్యత్తులో అక్రమ రవాణా నేరాలను కట్టడి చేసేందుకు దోహదపడుతుందన్నారు .
అదేవిధంగా జిల్లాలో రాత్రి గస్తీ, పెట్రోలింగ్ బ్లూ కోల్ట్స్ , నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. నేరాల నియంత్రణ, కేసులు చేధించేందుకు నేను సైతం /కమ్యూనిటీ పోలిసింగ్ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వాములుగా చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా చోరీ సొత్తు రికవరీపై పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసుల్లో త్వరితగతిన పురోగతిని సాధించాలని ఆదేశించారు.
ముఖ్యంగా హొటళ్లు, లాడ్జ్ లు, బస్‌స్టాండు ,రైల్వే స్టేషన్లలో అకస్మక తనిఖీలు చేయాలని ,అనుమానిత నేరగాళ్ల నిఘా పెట్టాలని సూచించారు. టెక్నికల్ ఎవిడెన్స్, సేకరించి చోరీ కేసుల దర్యాప్తులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు.
సిబ్బంది పనీతీరుపై స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో
పాటు ప్రతిరోజు రోల్ కాల్ లో విధులకు సంబంధించిన సిబ్బందితో సమీక్షా జరపాలని అన్నారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ డీసీపీ కుమారస్వామి,
ఏసిపిలు అంజనేయులు, భస్వారెడ్ది, వేంకటేశ్, రహెమాన్, రామోజీ రమేష్, ప్రసన్న కుమార్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు .