ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది

Spread the love
The world famous Balapur Laddu auction is over

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు ధర పలికింది.

రూ. 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.9 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా… ఈ సారి అంతకు మించి రూ.24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకున్నారు.

గతేడాది కంటే రూ.5లక్షల 70 వేలు ఎక్కువ పలికిన బాలాపూర్ లడ్డూ

ఏడాదికేడాది పెరుగుతూ వస్తోన్న బాలాపూర్ లడ్డూ వేలం… ఈ సారి రికార్డ్ స్థాయిలో పెరిగింది. గతేడాది మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కలిసి రూ.18 లక్షల 90 వేలకు కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది వేలం పాటలో బాలాపూర్ గ్రామస్థుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో గతేడాదితో పోల్చితే లడ్డూ వేలం ఈ సారి రూ.5 లక్షల 70 వేలకు పెరిగింది.

Related Posts

You cannot copy content of this page