The ultimate gift to society is organ donation. Venkatappayya.
సమాజానికి ఇచ్చే ఆఖరి బహుమతి అవయవ దానం. వెంకటప్పయ్య.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కస్తూరి బజారుకు చెందిన సంకోజు. జ్యోతి స్వచ్ఛందంగా అవయవ దానం చేయడానికి ముందుకొచ్చి వివి రామయ్య ఆధ్వర్యంలోని స్పందన సేవా సంస్థ కార్యకర్త గుండా వెంకటప్పయ్యకు తన అంగీకార పత్రాన్ని అందజేసినారు. ఈ సందర్భముగా వెంకటప్పయ్య మాట్లాడుతూ విద్యావంతురాలైన జ్యోతి అవయవ దానం పై పూర్తిగా అవగాహనతో రావడం అభినందనీయమన్నారు.
పరుల కొరకే చెట్లు పండ్లను ఇస్తున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి. గోవులు పాలనిస్తున్నాయి అట్లే ఈ శరీరమును కూడా పరోపకార్యార్ధమే కదా. నేత్రదానంతో ఇద్దరు అందుల జీవితాలలో వెలుగులు నింపవచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు జీవన్దాన్ బృందం వారు వారి కుటుంబ సభ్యులకు అవయవ దానాల గురించి వివరించి వారిలో చైతన్యం కలిగించి పుట్టెడు దుఃఖంలోనూ వారిలో మానవత్వాన్ని మేల్కొల్పి అవయవ దానంతో ఎందరో కుటుంబ సభ్యుల వెలుగులు నింపుతున్న మానవతామూర్తులను పత్రికలలో చూస్తున్నాము.
అట్లే దేహదానంతో వైద్య విద్యార్థులకు, విజ్ఞాన గ్రంథంగా మారి బావి తరాలకు మందు లా మారవచ్చు. అందుకే దహనం చేయకండి. దానం చేయండి. ఇట్టి కార్యక్రమంలో స్పందన సంస్థ ప్రెసిడెంట్.గుండా రమేష్, బైరు. రమేష్, మిట్ట కోల కోటయ్య, ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత గుండా రమేష్, హనుమాన్ల. పిచ్చి రెడ్డి, దూలం. వెంకటనారాయణ పాల్గొన్నారు. వివరాలకు 9848159208,8341388431. నెంబర్లలో సంప్రదించగలరు. సర్వేజనా సుఖినోభవంతు.