బాల్య వివాహాలు నిర్మూలించుటలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

Spread the love

బాల్య వివాహాలు నిర్మూలించుటలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం :రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం
శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో
శనివారం జరిగిన అవగాహన మరియు సమీక్ష సమావేశం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ముఖ్య అతిథులుగా బ త్తుల పద్మావతి పాల్గొన్నారు.

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శాంత కుమారి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 మరియు జి ఓ ఎం ఎస్ 31 పై నాదెండ్ల మండల స్థాయి ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు సిబ్బందికి అవగాహన మరియు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం సాంఘిక దురాచారమని అన్నారు.

జడ్పిటిసి మస్తాన్ రావు మరియు పిడిసిసి చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో పలుమార్పులు చేసి బాలలందరూ చదువుకోవాలని అమ్మ ఒడి ,విద్యా దీవెన, విద్యా వసతి దీవెన వంటి పలు రకాల పథకాలు ఏర్పాటు చేసి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతుందని తెలిపారు.

బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే అని అన్నారు.

అమ్మాయి వయసు 18 సంవత్సరాలు అబ్బాయి వయసు 21 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేయాలని సూచించారు.
ముఖ్య అతిథి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ బాల్య వివాహల నిషేధ చట్టం 2006 పై అవగాహన కలిగిస్తూ బాల్య వివాహాలు జరిపినట్లైతే ప్రత్యక్షంగా పరోక్షంగా బాల్య వివాహానికి హాజరైనవారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తారని అన్నారు.
జీవో ఎంఎస్ 31 పై అవగాహన కలిగిస్తూ గ్రామస్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలకు చైర్మన్ గా ఉన్న గ్రామ సర్పంచులు బాల్య వివాహాలు జరగకుండా ప్రధాన పాత్ర పోషించాలని అవగాహన కలిగించారు.ఫోక్సో చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు మైనర్ బాలికను పెండ్లి చేసుకున్న మేజర్ వరుడికి 20 సంవత్సరాలు,16-18 సంవత్సరాలు లోపు మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వరుడికి 10 సంవత్సరాలు కఠినగార జైలు శిక్ష విధించబడినని అవగాహన కలిగించారు.బాల్య వివాహం జరిగినట్లయితే బాలల హక్కులైన జీవించే హక్కు అభివృద్ధి చెందే హక్కు రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యాపు హక్కులు కోల్పోతారని తెలిపారు. బాలల హక్కుల పై అవగాహన కలిగించారు.

నెలనెల నాదెండ్ల తాసిల్దారు, ఎంపీడీవో, ఎంఈవోలు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్,సి డిపి ఓ,హెల్త్ ఆఫీసర్స్, వీఆర్వో, మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్స్ నియోజకవర్గస్థాయిలో ఎన్ని బాల్య వివాహాలు ఆపారు , ఎన్ని కేసులు నమోదు చేశారు బడి బయట పిల్లలను ఎంతమందిని గుర్తించారు బాల్య వివాహాలపై నిర్మూలన తీసుకున్న చర్యలు సమీక్షించారు,
బడి బయట ఉన్న పిల్లలను ఎంతమంది గుర్తించారు, బడిలో ఎంతమందిని జాయిన్ చేశారు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా పిల్లల పట్ల దృష్టి పెట్టి ఎంతమందిని రీజన్ చేశారో నివేదిక ఇవ్వాలని ఆమె కోరారు.

ఈసారి రివ్యూ మీటింగ్ కి అందరూ సక్రమము అయిన నివేదికలతో సమీక్షకు రావాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14 2023న బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనుసరించి జీవో ఎంఎస్ 31, మరియు 39 ను ఉత్తర్వులు ఇచ్చింది అని అన్నారు ఆ ఉత్తర్వులు ప్రకారం బాల్యవివాహాల నిషేధ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారని వారందరూ కూడా ప్రతినెల సమావేశమై బాల్య వివాహాలు మరియు బాలలకు సంబంధించిన రక్షణ సంరక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు.

తాసిల్దారులు బాల్య వివాహాలు జరగబోతున్నప్పుడు ఇరు పార్టీలకు నోటీసులు అందజేసి బాల్య వివాహాలను ఆపాలని ఆదేశించారు.

ప్రతినెల రివ్యూ నిర్వహించాలని సచివాలయం సిబ్బందితో కలిపి ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాకీర్ హుస్సేన్, ఎంఈఓ కృష్ణారెడ్డి, మెడికల్ ఆఫీసర్ జ్ఞానేశ్వరి మండల గ్రామస్థాయి సర్పంచులు , గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, మహిళా మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాలొగొన్నారు.

Related Posts

You cannot copy content of this page