SAKSHITHA NEWS

The pending works in the village should be completed and made into a clean village

పల్లె ప్రగతిలోని పెండింగ్ పనులు పూర్తి చేసి, స్వచ్చ గ్రామంగా తీర్చిదిద్దాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామంలో ఉదయం 06:30 AM నుండి 10:30 AM వరకు పర్యటించారు.

తెలంగాణ ప్రభుత్వం కంటి చూపు మందగించిన ప్రజల కోసం చారిత్రాత్మకమైన కంటి వెలుగు పథకం రెండో విడతలో భాగంగా కొండాపూర్ కలాన్ లో మార్చి 9th నుండి 13 th వరకు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గ్రామంలో నూతన సీసీ రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.

గ్రామంలోని బావుల పై పైకప్పులు ఏర్పాటు చేయాలని, పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలను తొలగించి, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

గ్రామంలోని ట్రాన్స్మార్మర్ వేరే ప్రదేశానికి మార్చాలని, పాత స్థంబాలు తొలగించి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసిన స్థంబాలకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ నల్లాలకు చెర్రలు తీయకుండా నీటిని వాడుకోవాలని సూచిస్తూ… అధికారులు అందుకు అవగాహన కల్పించాలన్నారు.

గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిండిన ప్రతిసారి తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలని, ప్రజలు మిషన్ భగీరథ మంచినీటిని త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.

అనంతరం గ్రామంలోని లబ్ధిదారునికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS