SAKSHITHA NEWS

The KCR government is in a state of advanta, unable to pay the rent for the Tehsildar’s office.

తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించలేని అద్వాన స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం..

కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలైనా నేటికీ అద్దె భవనంలోనే కార్యకలాపాలు..

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో సొంత ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు..

గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారులకు భవన యజమాని కార్యాలయానికి తాళం వేసి ఝలక్ ఇచ్చింది
సుమారు ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అద్దె బకాయిలు ఉన్నట్టుగా తెలిసింది


ఈ విషయం తెలుసుకున్న పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు
అనంతరం భవన యజమాని చంద్రమణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా నిలిచిపోతుందంటూ తన గప్పాలతో యావత్ తెలంగాణా రాష్ట్ర ప్రజానీకానికి చెవులో పువ్వులు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ కనీసం స్వంత ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోలేని అద్వాన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు బంగారు తెలంగాణాకి బాటలు వేశాం అని చెప్పుకునే కేసీఆర్ ముందు ప్రభుత్వ కార్యాలయాలకు పునాదులు వేసుకోవాలని హితవు పలికారు


తహసీల్దార్ భవన యజమానులు కేవలం అద్దెపై ఆధార పడి వయోభారంతో ఇబ్బంది పడుతుంటే వారికి కనీస గౌరవం ఇవ్వకుండా ఇన్నాళ్లుగా వారికి రావలసిన అద్దెను చెల్లించకుండా కాలయాపన చేయడం సిగ్గు చేటని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి వారికి అద్దె చెల్లించి మీ ముఖ్యమంత్రికి చెప్పి స్వంత భవనాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి అని చురకలు వేశారు.


SAKSHITHA NEWS