ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి,12 శాతం బడ్జెట్ పెంచాలి-డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ

Spread the love

Government schools should be strengthened and the budget should be increased by 12 percent – Dr. Paramandla Ramakrishna

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి,12 శాతం బడ్జెట్ పెంచాలి-డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ.

హనుమకొండ
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హనుమకొండ లోని ప్రభుత్వ పాఠశాలను విద్యా నాణ్యతను మధ్యాహ్న భోజన వసతులను దగ్గరుండి పరిశీలించారు. పిమ్మట విలేఖరులతో మాట్లాడిన డాక్టర్ రామకృష్ణ, పేద మధ్యతరగతి పిల్లలకు జ్ఞాన నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను విద్య నాణ్యతను మరియు పాఠశాల వసతులను పటిష్టం చేసి బడ్జెట్ 6 నుండి 12 శాతం పెంచే అవసరం వెంటనే ఉందన్నారు. తెలంగాణ స్వయం పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు ఏమీ ఒరిగింది లేదన్నారు.

మొదటినుండి పాఠ్య పుస్తకాల దగ్గర నుండి తరగతి గదులు స్కూలు ఆవరణ మంచినీటి సదుపాయం టాయిలెట్లు ఇలాంటి ప్రాథమిక అవసరాలు కనీసం కూడా లేకుండా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేద మధ్యతరగతి పిల్లల జ్ఞాన అభివృద్ధిని మంట కలుపుతూ ఒక కీలుబొమ్మలా తయారు చేస్తూ భావి భారత భవిష్యత్తును మందబుద్ధిగా తీర్చిదిద్దుతున్న వైనం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యం అన్నారు.


పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా ఉంటూ ఉందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం అందించే కార్మికులు సైతం వారి జేబు నుండే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం వరకు కూడా సొంత డబ్బులతో పిల్లలకు భోజనం అందజేసి తరువాత బిల్లులను పొందుతున్నారు. బిల్లుల రిలీజులో కూడా ఇంత జాప్యం చేయడం వల్లనే ఆహారంలో నాణ్యత కోల్పోతోందని తెలియజేశారు. మధ్యాహ్న భోజనం అందించే కార్మికులు సైతం నిరుపేదలే అన్ని నెలలు ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయకపోతే వారు మాత్రం ఏ విధంగా ఈ మధ్యాహ్న భోజన వ్యవస్థను పటిష్టంగా నాణ్యతతో అందించగలరు అని ప్రశ్నించారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్యావసతులలో మధ్యాహ్న భోజన వసతులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుస్తకాల పంపిణీ యూనిఫామ్స్ ఇలాంటి ప్రాథమిక అవసరాలపై తప్పనిసరిగా దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను తక్షణమే పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న పూర్వ వైభవాన్ని రప్పించి వాటిని మరింత పటిష్టపరిచి మెరుగైన విద్యా ప్రాథమిక వసతులు అందించగలమని ఆశాభావం వ్యక్తపరిచారు.

Related Posts

You cannot copy content of this page