ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.

Spread the love

MLA Dasari who distributed support pensions.

ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*_


సాక్షిత : పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి (25) నిట్టూరు (57) గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు._

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.

గత పాలకుల హయాంలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ కేసీఆర్‌ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ గారి‌కే దక్కుతుందన్నారు

.

ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ ని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్‌ తప్పక ఇస్తామ‌న్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,వైస్ ఎంపీపీ రాజయ్య,సర్పంచ్ లు రిషిక-రాజేందర్, కవిత-వెంకట్రాజం,వేల్పుల కుమార్, బండారి మల్లయ్య, మల్లికార్జున్ రావు, కుమార్, ప్రవీణ్, వేణుగోపాల్ రావు, ఆకుల శ్రీనివాస్, సంపత్ రావు, సంపత్ రెడ్డి, నంబయ్య, లక్ష్మణ్, హరీష్, సంతోష్ రావు, MPDO , MPO ,తెరాస ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page