గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ – పల్లపు బుద్దుడు

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం సందర్భంగా ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తన చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పూల మాలవేసి తులసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ
దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన జన సంఘ్ వ్యవస్థాపకులు గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిధి నేడు అని అన్నారు.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు వారి జీవితంలో ప్రతిక్షణం శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయని అన్నారు. గాఢాంధకార భవిష్యత్తులో మునిగి ఉన్న భారత ప్రజానీకానికి భారతీయ జన సంఘం ద్వారా నూతన దిశను ప్రారంభించారు. భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు. పాఠ్యాత్యుల నైపుణ్యం విజ్ఞానం నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి నాగరికతలతో విద్యా విధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి అని స్వర్గీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అన్నారన్నారు. కాశ్మీర్ గురించి ఎన్నో పోరాటాలు చేశారు అని అన్నారు.మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యామ ప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్ర భాగాన నిలిచి బలిదానం చేశారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 370వ అధికరణను తొలగించి వారికి ఘనమైన నివాళి అర్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగ స్వామి గౌడ్, చిట్యాల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, చింతకాయల రాము, మల్లేష్ యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page