SAKSHITHA NEWS

The government is very important for the welfare of Mudiraj.

ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బీసీ వర్గాలకు న్యాయం చేసిన మొట్ట మొదటి సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. ముదిరాజ్ ల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

ముదిరాజ్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పరితపిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలు చేపల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్నాయని, చేపల పెంపకంతో అనేక మంది ఉపాధి పొందేలా ఆదాయ వనరుగా మార్చిన ఘనత సీఎం కేసీఅర్ కే దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో గుమ్ముల స్వామి ముదిరాజ్, గుమ్మడి మధు సుదన్ రాజ్ ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, తోడేటి సత్యం ముదిరాజ్, ఎల్.శ్రీనివాస్, పెంటయ్య ముదిరాజ్, కృష్ణ, తోట ప్రకాష్, యాట వరలక్ష్మీ, దమ్మని శివ కుమార్, నర్సింహా, కే.విజయ్, జి.వెంకటేష్, కే.రాములు, సత్తయ్య, చింత మల్లేష్, రాయలపురం కృష్ణ, తలారి గణేష్, ఎస్.బాగయ్య, ఎం.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS