The education of the rich now belongs to the poor too: MLA Bhumana
శ్రీమంతుల చదువు ఇకపై పేదపిల్లలకి కూడా సొంతం : ఎమ్మెల్యే భూమన
ప్రతి పేద విద్యార్థి ముందుండాలనే సీఎం తపన : మేయర్ శిరీష
దేశంలోనే విద్యార్థులకు మొదటగా ట్యాబ్ లను అందించిన ఘనత మన రాష్ట్రనిదే : కమిషనర్ అనుపమ*
సాక్షిత తిరుపతి* : శ్రీమంతుల పిల్లలు చదువుకొనే విద్యాసంస్థల ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద పిల్లలకు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే విద్యపై అనేక ప్రయోగాలు చేసిన బైజుస్ వారితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక బహుమతిగా అత్యంత విద్యా ప్రమాణాలు కలిగిన ట్యాబ్ లు అందిస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుపతి శ్రీ పండిత జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజుస్ ట్యాబ్ లను అందించే కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన ముఖ్య అతిథిగా పాల్గొనగా, నగర పాలక మేయర్ డాక్టర్ శిరీష , కమిషనర్ అనుపమ అంజలి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విద్యతో పోటీ పడాలని ఒక వర ప్రసాదం లాగా ముఖ్యమంత్రి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాంకేతికతో కూడిన విద్య గల పాఠ్యాంశాల ట్యాబ్ లను అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1400 కోట్లు ఖర్చు చేసి 4,56,832 ట్యాబ్ లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందిస్తున్నారని తెలిపారు.
తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 28 పాఠశాలలలో చదువుతున్న 1856 మంది 8వ తరగతి విద్యార్థులకు 148 మంది ఉపాధ్యాయులకు 2004 ట్యాబ్ లను అందించనున్నామని అన్నారు. ఈ వేదికపై ఉన్న నగరపాలక కమిషనర్ చిన్న వయసు వ్యక్తి అని, కానీ మా అందరి కన్నా పెద్ద స్థాయి ఐఏఎస్ ఉద్యోగస్తురాలని ఈ గౌరవం విద్యతోనే సాధ్యమైందని విద్యార్థులు గుర్తించాలని ఎమ్మెల్యే భూమన అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ విధ్యా ప్రాముఖ్యత తెలిసి, విద్య అనేది తరగని ఆస్తి అని నమ్మిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో ప్రతి పేద విద్యార్థి ముందు ఉండాలనే తపనతో అనేక పథకాలను విద్య కోసం అమలు చేస్తున్నారని అన్నారు. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలలో వసతులు, విద్యా ప్రమాణాల కోసం సి బి ఎస్ సి సిలబస్ అమలు చేస్తున్నారని, నేడు మీరు అందుకుంటున్న బై జ్యుస్ ట్యాబ్ లతో సాంకేతికతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామని అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా పాఠ్యాంశాలకు సాంకేతికత జోడించి ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నది మన రాష్ట్రంలోనే అన్నారు. నేడు8వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ 9, 10 తరగతులకు ఉపయోగపడేలా మూడు సంవత్సరాల కాలం ఈ ట్యాబ్ ను ఉపయోగించుకుని విద్యార్థులు విజ్ఞానవంతులు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బైజ్యుస్ ట్యాబ్ లను ప్రముఖులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు బసవ గీత, రామస్వామి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఎంఈఓ ప్రభాకర్ రాజు, నగరపాలక అడిషనల్ కమిషనర్ సునీత, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మునిశేఖర్ రెడ్డి, వివిధ పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.