తూర్పు రోడ్లతో తిరుపతికి మహర్దశ : ఎమ్మెల్యే భూమన

Spread the love

Mahardasa to Tirupati by Eastern Roads : MLA Bhumana

తూర్పు రోడ్లతో తిరుపతికి మహర్దశ : ఎమ్మెల్యే భూమన
నగరాభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ
రహదారుల అభివృద్దే ప్రజాభివృద్దికి మార్గం : డిప్యూటీ మేయర్ భూమన అభినయ్*


సాక్షిత తిరుపతి : తిరుపతి నగరాభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయడం అవసరమని, తిరుపతి నగరానికి ప్రతిపాదిత తూర్పు రోడ్ల అభివృద్దితో తిరుపతి నగరం అభివృద్ధి సాదిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల స్థితిగతులపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యలయంలో ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

తిరుపతి నగరాభివృద్దికి అవసరమైన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసే ప్రకియలో అధికారులు ప్రజలతో మమేకమై పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పనుల నిర్మాణంలోగాని, లీగల్ సమస్యల్లోగాని ఏవైన ఆటంకాలు వుంటె సత్వరమే అందరి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

నగరాలు అభివృద్ధి చెందాలంటే రహదారుల నిర్మాణాలు అభివృద్ది చెందాలనే దృక్పదంతో పని చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన అన్నమయ్య మార్గ్, వై.ఎస్.ఆర్ మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్లు నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్దికి దూరంగ వున్న కోర్లగుంట ప్రధాన రోడ్డు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలతో ఎంతో అభివృద్ది చెందుతుందన్నారు.

మాస్టర్ ప్లాన్ రోడ్లు అమలు అవుతున్న ప్రాంతాల్లోని స్థలాలు ఇచ్చిన వారికి త్వరగా టిడిఆర్ బాండ్లను అందించేందుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లు విస్తరిస్తే ప్రజా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని స్థలాలు ఇస్తున్న ప్రజలకి వివరించాలన్నారు. అనుకున్న సమయంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసి తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి,

డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి, ఆధం రాధాకృష్ణా రెడ్డి, పుల్లూరు అమర్నాధ్ రెడ్డి, ఉమాఅజయ్, వెంకట్ రెడ్డి, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈ చంద్రశేఖర్, డిఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, సంజీవ్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, మేనేజర్ చిట్టిబాబు, సర్వేయర్లు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page