“గ్రీవెన్స్ డే”లో వివిధ అర్జీదారులు సమస్యల పరిష్కరించిన జిల్లా అధికారులు

Spread the love

The District Officers who resolved the grievances of the various petitioners during the “Grievance Day”.

గ్రీవెన్స్ డే”లో వివిధ అర్జీదారులు సమస్యల పరిష్కరించిన జిల్లా అధికారులు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

అర్జీదారుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని అదనపు కలెకర్లు స్నేహలత. మొగిలి, ఎన్. మధుసూదన్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే”లో వివిధ సమస్యలపై అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు.

భూ సంబంధిత, పెన్షన్, దళితబంధు, ఉపాధి, తదితర సమస్యలపై అర్జీదారులు దరఖాస్తును. సమర్పించారు. మధిర మండలం దెందుకూరుకు చెందిన యడ్లపల్లి వీరయ్య దెందుకూరు గ్రామ రెవెన్యూ సర్వేనెం.276/ఆ/3లో తనకు చెందిన విస్తీర్ణం 10 కుంటలు తన పేరున నమోదు కాలేదని సర్వే చేసి తన పేరున ఆన్లైన్ చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యకై మధిర తహశీల్దారుకు సూచించినారు.

ముదిగొండ మండలం యడవల్లికి చెందిన కలకొండ కవిత తనకు వచ్చే వికాలంగుల పింఛను నిలుపుదల చేసినారని అట్టి ఫించను పునరుద్ధరణ చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలుకై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించినారు.

ఖమ్మం నగరం 1 వ డివిజన్ కైకొండాయిగూడెంకు చెందిన బోడ రవికుమార్ సర్వేనెం. 269లో గల ఎర్రకుంట చెరువు శిఖం భూమి 14-23 కుంటలు కలదని ఇట్టి భూమి ఆక్రమణకు గురయినదని సర్వే చేయించి అట్టి భూమిని స్వాదీన పర్చుకొని తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రూరల్ తహశీల్దారుకు సూచించారు.

ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంకు చెందిన మత్సకారులు 21 మంది సభ్యులుగా ధృవీకరించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, అన్వార్య కారణముల వల్ల నిలుపుదల చేసినారని అట్టి సహకార సంఘంలో సభ్యులుగా నమోదు అవుటకు అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యశాఖ సహాయ సంచాలకులు సూచించారు.

రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంకు చెందిన గునగంటి లక్ష్మీ తన భర్త 2020వ సంవత్సరంలో కరోబారిన పడి మరణించడం జరిగిందని ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం అందించగలరని సమర్పించిన దరఖాస్తును, గుండ్ల సుధాకర్ తాను దళితబంధు పథకం క్రింద డయగ్నస్టిక్ ల్యాబ్ను ఎంచుకోవడం జరిగిందిని అట్టి యూనిట్ను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తదుపరి చర్యలు గోకొనవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించినారు.

తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంకు చెందిన నేలమర్రి కవిత తాను ఎస్సీ కులమునకు చెందిన పేదవారమని ఏదేని ఉపాధి అవకాశం కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి సూచించినారు.

చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంకు చెందిన మోగపోతుల సురేష్, కాసిమాల వీర నాగేశ్వరరావులు తాము దళితబంధు పథకం క్రింద గొర్రెల యూనిట్ ఎంచుకోవడం జరిగినదని అట్టి యూనిట్ను మార్పు చేసి ట్రాన్స్పోర్టు యూనిట్ ట్రాక్టర్ను మంజూరుకు మార్పు చేయగలరని సమర్పించిన దరఖాస్తును ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి, గ్రామ ప్రత్యేక అధికారికి సూచించారు.

మధిర మండలం ఆత్కూరు గ్రామంకు చెందిన కంభంపాటి లక్ష్మీయ్య తనకు ఎస్సీ కార్పోరేషన్ నుండి లోన్ మంజూరు అయినదని మధిర ఆంధ్రాబ్యాంకులో లోన్ విషయమై సబ్సీడీకి సంబంధించి లోన్ శాంక్షన్లో జాప్యం జరుగుచున్నదని తనకు అట్టి జాప్యంను నివారించి త్వరితగతిన లోన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించినారు.

జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్.డి.ఓ రవీంధ్రనాద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు గ్రీవెన్స్ డేలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page