The central BJP government should avoid making mistakes in the matter of purchase of crops
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలి
సాక్షిత : రైతన్నల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
రైతు రాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి విశిష్ట కృషి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత
ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కోరిక మేరకు బీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు చేస్తాం
*పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు .వొడితల సతీష్ కుమార్ *
ఎల్కతుర్తి మండల పరిధిలోని దండెపల్లి గ్రామంలో ఉద్వాన పట్టుపరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగులో భాగంగా సాగుకు సిద్ధం అయిన రైతుల పొలాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి సాగుకు శ్రీకారం చుట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధిక దిగుబడులు ఇచ్చే పంటలతో ఆయిల్ ఫామ్ పంట ఒకటి అన్నారు,మనము వాడే వంట నూనెలలో పామ్ ఆయిల్ కూడా ప్రముఖమైనది అని అన్నారు.
ఇప్పుడు మొట్టమొదటిసారిగా దండెపల్లి గ్రామంలో సాగుచేయడానికి ముందుకు వచ్చిన రైతులకు అభినందనలు.
ఆయిల్ ఫామ్ చెట్టులోని ఫలం లోని పీచు భాగాల నుండి వంట నూనె,గింజల నుండి కెర్నల్ నూనె దిగుబడి అవుతుంది అని తెలిపారు.
సమైక్యరాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతోనే ఆయిల్‌ఫాం సాగు రాష్ట్రంలో సాగుచేయలేదని అన్నారు.
ఇటీవల ఆయిల్ ఫెడ్ సంస్థ సర్వే చేయగా తెలంగాణ రాష్ట్రంలో 206 మండలాలు ఆయిల్ ఫాం మొక్కల పెంపకానికి అనువైనవని తేల్చారన్నారు.
మలేసియా, ఇండోనేషియా వంటి చిన్న చిన్న దేశాల్లో ఆయిల్ ఫాం సాగును చేసి రైతులు అధిక లాభాలను పొందుతున్నారన్నారు.
నియోజకవర్గంలో పెద్దఎత్తున ఆయిల్ ఫాం పంటలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అత్యధికంగా వ్యవసాయ శాఖ కోసమే నిధులు కేటాయించి రైతుల అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పారు.
ఎకరాకు లక్ష ఆదాయం రూపాయలు వచ్చే ఈ పంటను సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తుంది అని అన్నారు.
నీటి సౌలభ్యత ఉన్నచోట ఆయిల్ ఫామ్ వంటి సాగును ప్రోత్సాహించడం ద్వారా రైతాంగాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చెయ్యొచ్చు అని అభిప్రాయపడ్డారు.