పాలకుర్తి మండల కేంద్రంలో 16 నుండి 18 వరకు జరగబోయే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ

Spread the love

Telangana National Integration Vajrotsava to be held from 16th to 18th at Palakurti Mandal Centre

జనగామ జిల్లా:

పాలకుర్తి మండల కేంద్రంలో 16 నుండి 18 వరకు జరగబోయే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల సభ ప్రాంగణలోని ఏర్పాట్లను పరిశీలిస్తున్న, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , పరిశీలన అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సభకు విచ్చేసిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ఆధీకారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయ౦ తో పనిచేసి సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి , జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి మదార్, మండల అధ్యక్షులు నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతు మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, జిల్లా రైతు బందు సమితి మెంబర్ జరుపుల బాలు నాయక్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పాము శ్రీనివాస్, పాలకుర్తి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కడుదుల కరుణాకర్ రెడ్డి, కే.యు జే.ఏ.సీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్, ఎసిపి శ్రీనివాస్ రావు, డిపిఓ రంగాచారి, ఆర్డీవో కృష్ణవేణి, ఎంపిడిఓ అశోక్ కుమార్, ఎమ్మార్వో పాల్ సింగ్, సిఐ వి. చేరాలు, ఎస్ ఐ టి.శ్రీకాంత్ అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page