భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని దేవుడి ప్రచార రథంలా మార్చి వారే స్వామీజీగా భక్తులుగా మారి గంజాయి సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాల్లో బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తమ ప్రాంతానికి తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోతో పాటు, గంజాయిని రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.1.21 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..
దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…