విద్యార్థులు చెడు అలవాట్లు మానుకోవాలి

Spread the love


Students should avoid bad habits

విద్యార్థులు చెడు అలవాట్లు మానుకోవాలి
క్రమశిక్షణ తో దేశభక్తినిపెంపొందించుకోవాలి కల్వకుర్తి ఎస్సై రమేష్ పిలుపు


సాక్షిత : కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సురెంధర్ రెడ్డి అద్యక్షతన విద్యార్థుల్లో అవేర్నెస్ – సైబర్ నేరాల నివారణఅంశంపై ప్రోగ్రాం నిర్వహించారు .ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎస్ఐ.ఏ .రమేష్ హాజరయ్యారు.గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు కష్టపడిచదివే మనస్తత్వంతో ముందుకు సాగుతారని వివరిస్తు ప్రభుత్వ

కళాశాలవిద్యార్థులుఆటలు,పాటలు ,చదువు , సంస్కారం, దేశభక్తి భావాల్ని పెంపొందించడంలోముందంజలో ఉంటారని పేర్కొన్నారు.విద్యార్థులుచెడుఅలవాట్లకు ,చెడు స్నేహానికి సెల్ ఫోన్ ,టీవీల ట్రాప్ లో పడకుండ దురాలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్సై రమేశ్ పేర్కొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా విద్యార్థులతో , సమర్ధవంతంగాబోధించేఅధ్యాపకులతో ,

పచ్చని చెట్లు ,ఆహ్లాదకరమైన వాతావరణంతో, స్టడీఅవర్స్ నిర్వహించి కళాశాలకు మంచి పేరు తెస్తున్న ప్రిన్సిపాల్ సురెంధర్ రెడ్డికృషి ని ఎస్సై అభినందించారు.అనంతరం ఎస్సైని శాలువాతో సన్మానించారు.ఈకార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సదానందం గౌడ్ ,వేను,రాముడు,రమాకాంత్,మల్లేష్,పరుశురాం,శ్రీనివాస్,బాలరాజ్ ,భీమేష్,గిరిబాబు,సంతోష్ గౌడు , లక్ష్మయ్య మొదలగు అధ్యాపకులతో పాటు పోలీస్ సిబ్బంది హనుమంత్ రెడ్డి, రూప్ సింగ్ ,చిరంజీవి,జగన్ , లింగస్వామి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page