పోలీస్ స్టేషన్ సందర్శించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు

Spread the love

విద్యార్థుల క్షేత్ర పర్యటన

పోలీస్ స్టేషన్ సందర్శించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు

“లా అండ్ జస్టిస్ – ఏ కేస్ స్టడీ” అనే పాఠ్యాంశంపై అవగాహన కల్పించేందుకు హెచ్ఎం పులీ అశోక్ రెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ముల్కల కుమార్ ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ వీణవంక 8వ తరగతి విద్యార్థులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అక్యూజుడ్,విక్టిమ్, ఇన్వెస్టిగేషన్, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, అరెస్టు చేయడం, సమన్స్ జారీ చేయడం, చార్జి సీటు దాఖలు చేయడం,బెయిల్ పొందే విధానం వంటి పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అప్పిలేటు విధానంలో భాగంగా క్రింది స్థాయిలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, పై స్థాయిలలో సెషన్ కోర్టు,హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. పిల్లల ఆసక్తులను, భద్రతను పరిరక్షించుటకు భారత ప్రభుత్వం ఫోక్సో చట్టం-2012 తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కొనసాగుతున్నందున ఎమర్జెన్సీ టైంలో, డయల్ 100 కి కాల్ చేయుటకు వెనకాడకూడదని, తద్వారా సత్వర పోలీసు సహాయం పొందవచ్చన్నారు. మహిళలు వేధింపులకు గురి అయినచో 1098, సైబర్ మోసాల గురి అయితే 1930 కి కాల్ చేయాలన్నారు. సోషల్ ఉపాధ్యాయులు ముల్కల కుమార్ మాట్లాడుతూ… క్షేత్ర పర్యటనల వల్ల విద్యార్థుల్లో విషయ సేకరణ, విషయ అవగాహన ఎక్కువగా జరిగి, విషయాన్ని ఎక్కువ కాలం గుర్తించుకునేందుకు దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో వివరణాత్మక- విశ్లేషణాత్మక, పరిశీలనాత్మక- ప్రయోగాత్మక అభిరుచులు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డి, శ్రీనివాస్,లింగయ్య మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page