తైక్వాండోలో గోల్డ్ మెడల్స్ సాధించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు

Spread the love

తైక్వాండోలో గోల్డ్ మెడల్స్ సాధించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు

జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో చొప్పదండి మండలంలోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో వీణవంక హై స్కూల్ విద్యార్థులు బబ్బూరి అక్షిత(జూనియర్స్ 44-46 కేజీ విభాగంలో),బబ్బూరి తిరుమలేష్ (జూనియర్స్ 48-51 కేజీ విభాగంలో) గోల్డ్ మెడల్స్ సాధించి, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు కరికులర్ తోపాటు కోకరికులర్ యాక్టివిటీస్ లో ప్రత్యేక అభిరుచిని, ఆసక్తిని ఏర్పరచుకొని రాణించాలన్నారు. సైక్వాండో శిక్షణ విద్యార్థులలో ఫిట్నెస్ పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చురుకుగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణను నేర్పి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి- స్వీయరక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. కండర శక్తిని బలోపేతం చేసి, ఏకాగ్రతను పెంచి, విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుందన్నారు. తైక్వాండో మాస్టర్ బావు సంపత్ ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page