తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలు చవి చూసి ప్రైవేట్ అయ్యే స్థితిలోకి నెట్టబడిన ఆర్టీసీని సీఎం
కేసీఆర్ స్వరాష్ట్రంలో, లాభాల బాట పట్టించారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ కి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మంత్రి కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్టీసీ డిపోలో బుధవారం ఉద్యోగులు, కార్మికులతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ తో స్వీట్స్ తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, డిపో మేనేజర్, ఆర్టీసీ కార్మికులు, మరియు బీ ఆర్ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, డా.సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.