తిరుపతిలో జరుగు హమాలీల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.

Spread the love


State Mahasabhas of Hamali held in Tirupati.

తిరుపతిలో జరుగు హమాలీల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.

సాక్షిత : విజయవాడ… హమాలీ ముఠా జట్టు కళాశీల రాష్ట్ర మూడవ మహాసభ జనవరి 29 30 తేదీలలో తిరుపతి నగరంలో జరుగుతుంది ఈ మహాసభ ఏర్పాటు ఇప్పటికే పూర్తయినవి రాష్ట్రం నలుమూలల నుండి హమాలీ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని హమాలి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయము గొల్లపూడిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశానికి రావుల అంజిబాబు అధ్యక్షత వహించగా హమాలీ యూనియన్ రాష్ట్ర నాయకులు టీ తాతయ్య, సురేంద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షల మంది హమాలీ కార్మికులు ముఠా కార్మికులు జట్టు కార్మికులు కళాసి కార్మికులు ప్రతినిత్యం పనిచేస్తూ ప్రజలకు సర్వీసులు అందిస్తూ చాలీచాలని వేతనంతో జీవనం సాగిస్తున్నారని ఈ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తరహాలో హమాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కొన్ని సౌకర్యాలు కలిగించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు

ముఖ్యంగా ఈ కార్మికులకు పనిచేసేటప్పుడు లారీల నుండి కిందపడి చనిపోయిన కాలు చేయి విరిగిన ఆదుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక భద్రత చట్టం కింద హమాలీ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రతి హమాలీ కార్మికునికి వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ కుటుంబ పరంగా ఇన్సూరెన్స్ లారీల నుంచి పడిన దెబ్బ తగిలిన వారికి యజమానుల నుండి కంపల్సరీ కంపెంజేషన్ అలాగే తరతరాలుగా వస్తున్న లారీ మామూలు పట్టమాములు అన్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు

తిరుపతిలో జరిగే మూడవ రాష్ట్ర మహాసభల్లో దాదాపు 5000 మంది ప్రదర్శనలో పాల్గొంటారని 500 ప్రతినిధులతో మహాసభ నిర్వహిస్తామని ఈ మహాసభల్లో భవిష్యత్తులో హమాలీల కోసం జరిగే పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు ఈ మహాసభకు కేంద్రం నుండి హమాలీ సంఘం నేతలు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని కావున ప్రతి హమాలీ కార్మికుడు తిరుపతికి కదిలి రావాలని పిలుపునిచ్చారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page