కంది: : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20 రోజుల నుండి 15 మంది కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పాశ మైలారం క్యాసారం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించి చేతి గుర్తుకి ఓటేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, మల్లేష్, రాజు, అభిషేక్ గౌడ్, ఎం సంతోష్, శ్రీనివాస్, శ్రీరాములు, నర్సింలు, ప్రసాద్, విట్టల్, శేఖర్, ప్రవీణ్, మహేష్ చారి, కే రాజు పాల్గొన్నారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…