కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

Spread the love

Sri Ramaraksha is the welfare scheme introduced by KCR

కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం

ముచ్చటగా మూడోసారి రానున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు.

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

కెసిఆర్ పథకాలే శ్రీరామరక్ష కెసిఆర్ పథకాలు దేశానికి ఆదర్శం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ముచ్చటగా మూడోసారి రానున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ముదిగొండ మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు కార్యకర్తలకు తెలియజేశారు,

భారత దేశంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు బంగారు తెలంగాణ దిశగా కష్టపడుతున్నారని 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు.

దళిత బంధు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే 70 సంవత్సరాలు పాలన చేసిన ప్రభుత్వాల్లో ఏమీ చేయలేని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మేమే తెస్తున్నం మేమే ఇస్తున్నాం

అనడం సిగ్గుచేటు అని అన్నాను అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా రైతులకు పేద ప్రజల కోసం ఇంత గొప్ప పథకాలను ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

Related Posts

You cannot copy content of this page